నకిరేకల్, జూన్ 18 : బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పట్టణంలోని 18వ వార్డు వడ్డెర కాలనీకి చెందిన 50కుటుంబాల వారు ఆదివారం ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. వడ్డెర కులస్తులకు కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. అదేవిధంగా వడ్డెర కులానికి శ్మశానవాటిక, ప్రహరీ, స్నానపు గదులు నిర్మిస్తానని హామీనిచ్చారు.
పార్టీలో చేరిన వారిలో గోగుల సుదర్శన్, గోగుల యల్లమ్మ, రుపాని సైదమ్మ, ఆలకుంట్ల వెంకన్న, ధనమ్మ, సంతోష, వరికుప్పల చంద్రయ్య, ఇద్ద య్య, నర్సింహ, రమేశ్, అనిల్, గండికోట రాము లు, ఆలకుంట్ల యాదమ్మ, గురువయ్య, ఓర్సు యల్లయ్య, లక్ష్మి, గండికోట నాగమణి, ఆలకుంట్ల సత్తమ్మ, వరికుప్పల రేణుక, ఆలకుంట్ల ఇస్తారి, ముత్తయ్య, ఆలకుంట్ల వెంకటేశ్, ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, కౌన్సిలర్లు సునీల్, లక్ష్మణ్, నాయకులు పెండెం సదానందం, మాద నగేశ్, శ్రవణ్, యాదగిరి, ఎండీ.జాఫర్ పాల్గొన్నారు.