మిర్యాలగూడ, నవంబర్ 11: మిర్యాలగూడ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధి సీం కేసీఆర్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. గురువారం పట్టణంలోని షాబునగర్, గాంధీనగర్, విద్యా నగర్, రాంనగర్, తాళ్లగడ్డ, చైతన్యనగర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రగతియాత్ర నిర్వహించారు. గాంధీనగర్‌లోని శ్రీకనకదర్గు, ముత్యాలమ్మ దేవాలయాల్లో ఎమ్మెల్యే భాస్కర్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆయా వార్డుల పరిధిలోని వీధుల్లో ఎమ్మెల్యే భాస్కర్‌రావు ప్రచారాన్ని కొనసాగించారు. ఎమ్మెల్యే ప్రచారం సందర్భంగా మహిళా కోలాట బృందాలు తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలికారు. పలు వీధుల్లో మహిళలు బొట్టుపెట్టి, మంగళహారతులతో ఆశీర్వదించారు.
పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. వార్డుల్లోని వీధులు గులాబీ జెండాలతో లన్ని బీఆర్ఎస్ జెండాలతో రెపరెపలాడాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ వ్యాపారపరంగా ప్రసిద్ధికెక్కిన మిర్యాలగూడ మున్సిపాలిటీ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు గణనీయంగా ప్రగతిని సాధిస్తున్నాయని, దీనికి మంత్రి కేటీఆర్ కారణమన్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం వంద కోట్లను ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన సంక్షేమ పథకాలన్ని అమలు కావాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలన్నారు. ప్రజలందరు కారు గుర్తుకు ఓటు వేసి తనకు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, కౌన్సిలర్లు ఉబ్బపల్లి వెంకమ్మసోములు, బంటు రమేష్, బాసాని అలివేలుగిరి, పూనాటి లక్ష్మీనారాయణ, నాయకులు బంటు కా త్యాయని, దైద సోముసుందర్, కుప్పాల సుబాబరావు, పెద్ది శ్రీనివాస్ గౌడ్, అల్లాని రమేష్, రేపాల రమేష్, బంటు శ్రీను, గోపాలకృష్ణ, గొంగిడి సైదిరెడ్డి, దైద నర్సింహా, పద్మ, ఎల్లమ్మ పాల్గొన్నారు.
మిర్యాలగూడ: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పట్టణానికి చెందిన ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని 1వ వార్డు ఇన్చార్జి పూనాటి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు కోల రామస్వామి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులు 200 మందితో పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు సమక్షంలో పార్టీలో చేరా రు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మి ర్యాల గూడ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో చేరడం అభినందనీయమన్నారు. కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో నాగిళ్ల శివ, దాసరాజు ప్రసాద్, బంటు పెద్దులు, బంటు మట్టయ్య, బంటు ప్రసాద్, శివ, గోపితోపాటు మరికొందరు ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు ఉన్నారు.