MLA Bathula Laxma Reddy | మిర్యాలగూడ, ఫిబ్రవరి 25 : ఇవాళ మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్, స్టార్ హాస్పిటల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టార్ హాస్పిటల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రి వారు మన వద్దకే వచ్చి క్యాన్సర్, మెదడు, గుండె సంబంధిత వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ప్రతీ ఒక్కరు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Kothagudem | జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి.. కొత్త అక్రెడిటేషన్ కార్డులపై మీడియా అకాడమీ విఫలం..
Kothagudem | మళ్లీ సర్వే చేయండి.. కులగణనలో మున్నూరుకాపులకు అన్యాయం: కాంపెల్లి కనకేష్ పటేల్
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!