మిర్యాలగూడ, మే 14: ఈ నెల 15 నుంచి 21 వరకు ఇరాన్లో జరిగే బేస్‌బాల్ వెస్ట్ ఏసియా కప్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌కు మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన గుత్తి శివకుమార్ భారత జట్టు తరఫున ఆడేందుకు ఎంపికైనట్లు బేస్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చిర్ర మల్లేశ్ తెలిపారు.
బుధవారం మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన శివకుమార్‌కు బేస్‌బాల్ క్రీడ పట్ల ఉన్న ఆసక్తిని గమనించి తాను జిల్లా కేంద్రంలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ బేస్‌బాల్ పోటీలకు ఎంపికైన శివకుమార్‌ను అమరావతి సైదులు, పాశం నరసింహారెడ్డి, ఉస్మాన్ షేక్, పరమేశ్, శంకర్, మౌనిక, మహేష్, స్వామి, పవన్, రవి అభినందించారు.