మిర్యాలగూడ అభివృద్ధిలో గంగాధర్ పాత్ర మరువలేనిది
మిర్యాలగూడ పట్టణాభివృద్ధికి తిరునగరు గంగాధర్ పాత్ర మరువలేనిదని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, మాజీ సైనికుడు దివంగత తిరునగరు గంగాధర్ 4వ వర్ధంతిని శనివారం పట్టణంలో నిర్వహించారు.
- ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు
మిర్యాలగూడ, జనవరి 27 : మిర్యాలగూడ పట్టణాభివృద్ధికి తిరునగరు గంగాధర్ పాత్ర మరువలేనిదని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, మాజీ సైనికుడు దివంగత తిరునగరు గంగాధర్ 4వ వర్ధంతిని శనివారం పట్టణంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజీవ్చౌక్ వద్ద గల ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు వేర్వేరుగా పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో అనేక అభివృద్ధి పనులను చేపట్టి ప్రజల ఆదరాభిమానులను చూరగొన్న గొప్ప నాయకుడు గంగాధర్ అని ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రాష్ట్ర ఆగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మెరుగు రోశయ్య, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మోసిన్అలీ, నాయకులు ధీరావత్ స్కైలాబ్నాయక్, మగ్దూంపాషా, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

