మిర్యాలగూడ/దేవరకొండ, అక్టోబర్ 31 : మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అభిమాన నేత కేసీఆర్ను చూసేందుకు, ఏం చెప్తారో వినేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ట్రాక్టర్లు, ఆటోలతోపాటు వివిధ వాహనాల్లో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. సభలో సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని జనం ఆసక్తిగా విని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మద్దతు పలికారు. కళాకారుల ఆటపాటలు ఉర్రూతలూగించగా..జై బీఆర్ఎస్.. జై కేసీఆర్ నినాదాలు మార్మోగాయి.
‘ఉత్తమ్ కుమార్రెడ్డి రైతుబంధు వద్దంటున్నాడు. రేవంత్రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు చాలంటున్నాడు.. కాంగ్రెస్లో డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్లో ఒక్కరే ముఖ్యమంత్రి.. మరి ఏ పార్టీ కావాలి.. ఎవరు కావాలో తేల్చుకోవాలి’ అని అడుగగా బీఆర్ఎస్ వెంటే మేము అంటూ జనం చేతులెత్తి నినదించారు.
మిర్యాలగూడ, దేవరకొండలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ట్రాక్టర్లు, ఆటోలతోపాటు వివిధ వాహనాల్లో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. సభలో సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని జనం ఆసక్తిగా విని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మద్దతు పలికారు. బీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలతో సభ పరిసరాలు గులాబీమయంగా మారాయి. కళాకారుల ఆటపాటలు ఉర్రూతలూగించగా..జై బీఆర్ఎస్.. జై కేసీఆర్ నినాదాలు మార్మోగాయి. ‘ఉత్తమ్ కుమార్రెడ్డి రైతుబంధు వద్దంటున్నాడు. ఆ పార్టీ అధి నాయకుడు రేవంత్రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు చాలంటున్నాడు.. కాంగ్రెస్లో డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్లో ఒక్కరే ముఖ్యమంత్రి.. మరీ ఏ పార్టీ కావాలి.. ఎవరు కావాలో తేల్చుకోవాలి’ అని అడుగగా బీఆర్ఎస్ వెంటే మేము ప్రజలు అంటూ చేతులెత్తి నినదించారు.