విద్యార్థులు నష్టపోకుండా సెప్టెంబర్ 1 నుండే బస్‌పాస్‌లు జారీ
ప్రారంభం రోజునే బస్‌పాస్‌లు ఇవ్వడం పట్ల హర్షం

మిర్యాలగూడ టౌన్: కరోనా నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలు అన్నీ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైనందున ప్రభు త్వం సైతం ఆ దిశగా విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సత్వర చర్యలు తీసుకుంది. మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు కళాశాలలో చదివే విద్యార్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తుంటారు. అం దులో భాగంగా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అన్నీ గ్రామాలకు బస్సులను నడపాలనీ ఆదేశించ డంతో పాటు విద్యార్థులకు రాయితీ బస్‌పాస్‌లను ప్రారంభించాలని ఆదేశించారు.
ఆర్టీసీ నుంచి విద్యార్థులు బస్‌పాస్ పొందాలంటే ప్రైవేట్ విద్యాసంస్థలు ముందస్తు డిపాజిట్ రుసుము చెల్లించాలి. విద్యార్థు ల సంఖ్యకు అనుగుణంగా వివిధ విద్యాసంస్థలకు సంవత్సరానికి కొంత రుసుము చెల్లించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ రుసుము చెల్లిస్తేనే ఆన్లైన్లో సంబంధిత కళాశాల లేదా పాఠశాల పేరు నమోదై ఉంటుంది. దీని ఆధారంగానే ఆన్లై న్లో నమోదైన విద్యాసంస్థల విద్యార్థులకే బస్‌పాస్‌లు జారీ చేస్తారు.

విద్యాసంస్థలు చెల్లించాల్సిన అడ్మినిస్ట్రేటివ్ రుసుము
ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలకు అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ రుసుము రూ.4వేలు, అన్నీ ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, ఐటీఐ, ఒకేషనల్ కాలేజీలు రూ3వేలు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే రెండు వందల మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న పాఠశాలలకు రూ.750, రెండు వందల నుంచి ఐదు వందల మంది విద్యార్థుల వరకు రూ.1000, అదేవిధంగా ఐదు వందల మంది కంటే ఎక్కువగా విద్యార్థులు ఉన్న పాఠశాలలు సంవత్సరానికి రూ.15ంం చెల్లించాలి.
ఉచిత బస్‌పాస్‌లు వీరికే
7వతరగతి వరకు చదివే బాలురు, 10వ తరగతి వరకు చదువుకునే బాలికలకు 20 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి ఉచితంగా బస్‌పాస్‌లను అందిస్తారు. ఇది ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్నీ పాఠశాలల విద్యార్థులకు వర్తిస్తుంది. అయితే కార్డుకు మాత్రం రూ.30 చెల్లించాలి. ఇతర పాఠశాలలో చదివే విద్యార్థులు రాయితీ బస్‌పాస్‌ల కోసం ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవాలి. అట్టి ధరఖాస్తులను సంబంధిత విద్యాసంస్థలు అనుమతిస్తే ఆర్టీసీ బస్‌పాస్ కౌంటర్ ఆన్లైన్లో సంబంధిత స్టూడెంట్ పేరు వస్తుంది.
దీని ద్వారా విద్యార్థికి బస్‌పాస్‌ను అందిస్తారు. 5 కిలోమీటర్ల నుంచి 35కిలోమీటర్ల ప్రయాణం వరకు ఈ రాయితీ బస్పా స్లు మంజూరు చేస్తారు. 5 కిలోమీటర్ల లోపు రూ.115, 10కి,మీ వరకు రూ.140, 15కి.మీ వరకు రూ.180, 20 కి.మీ వరకు రూ.240, 25కి.మీ రూ.300, 30కి.మీ రూ.330, 35కి.మీ రూ.355 చొప్పున నెలవారీగా బస్‌పాస్ రుసుముని చెల్లించాల్సి ఉంటుంది.