కట్టంగూర్, జూలై 28 : నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు మంగళవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్కు మంత్రులు నలమాద ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం రానున్నట్లు ఆర్జీఓ యారాల అశోక్ రెడ్డి సోమవారం తెలిపారు. కట్టంగూర్ గ్రామ పంచాయతీ అవరణలో నిర్వహించనున్న సభా స్థలాన్ని సోమవారం డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ కొండల్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. ఆయన వెంట ఎండీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, డీటీ ప్రాంక్లిన్ ఆల్బట్, సివిల్ సప్లయ్ టీడీ రాచకొండ జ్యోతి, ఎస్ఐ రవీందర్, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది సుక్కయ్య, నాయకులు ఐతగోని నారాయణ, రెడ్డిపల్లి సాగర్, గద్దపాటి దానయ్య. ఐతగోని నర్సింహ్మ, మిట్టపల్లి శివ, ముక్కాముల శేఖర్, అనిల్ రెడ్డి అన్నారు.