పాలకవీడు, జూన్ 27: మండలంలోని మూసీ, కృష్ణానదిపై నిర్మిస్తు న్న బెట్టెతండా, జాన్‌పహాడ్ లిప్ట్ పనులను వేగవంతం చేసి అం దుబాటులోకి తేవాలని నీటి పారుదల, పౌరసరఫరా శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవా రం బెట్టెతండా, జాన్‌పహాడ్ గ్రామాల్లో జరుగుతున్న లిఫ్ట్ నిర్మాణ పనులను ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భం గా లిప్ట్ నిర్మాణ పనుల్లో పురోగతి లేద ని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మూడుసార్లు లిప్ట్ పనుల పరిశీనకు వచ్చినా కాంట్రాక్టర్లో గానీ అధికారుల్లో గానీ చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యుద్ధ ప్రాతిపదికన వేగంగా నాణ్యతతో పనులు చేయాలని ఆదేశించారు. రూ.302 కోట్లతో నిర్మిస్తున్న లిఫ్ట్‌తో 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, పైప్‌లైన్ పనులు ఒకేసారి నిర్మించి త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. బెట్టెతండాలో రూ.33.83 కోట్లతో చేపట్టిన లిఫ్ట్ నిర్మాణాన్ని పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్పీ నర్సింహ, ఇరిగేషన్ సీఈ రమేశ్‌బాబు, ఎస్ఈ శివధర్మతేజ, డీఈ నవీకాంత్, ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, సీఐ చరమంద రాజు, నాయకులు భూక్యా గోపాల్, మోతీలాల్, సుబ్బారావు, నర్సింహారావు, జితేందర్‌రెడ్డి ఉన్నారు.
చింతలపాలెం, జూన్ 27: ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, నక్కగూడెం ఎత్తిపోతల పథకం, రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఈ పథకాలకు సంబంధించిన పనులను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి పరిశీలించారు. ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, నక్కగూడెం ఎత్తిపోతల పథకం, రాజీవ్‌గాంధీ ఎత్తిపోతల పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రాంచ్ కెనాల్ కింద నష్టపోతున్న రైతుల భూముల సేకరణను వేగవంతం చేసి, రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.