నల్లగొండ, సెప్టెంబర్ 17: తెలంగాణ సాయుధ పోరాటం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్-17ను పురస్కరించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పరేడ్ గ్రౌండ్లో ప్రజాపాలన దినోత్సవం పేరుతో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఎందరో త్యాగధనులు పోరాటం చేసినందునే ఈ రోజు మనం ఆ ఫలాలు అనుభవిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య మొదలు భీంరెడ్డి నర్సింహారెడ్డి, బొమ్మగాని ధర్మబిక్షం, ఆరుట్ల రామచంద్రా రెడ్డి, చాకలి ఐలమ్మ, ఎల్లారెడ్డి లాంటి వారు ఎన్నో పోరాటాలు చేశారని, వారి పోరాటం వృధా కాలేదన్నారు.
కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్, నకిరేకల్ ఎమ్మెల్యే వేములు వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, గ్రంధాలయ చైర్మన్ హఫీజ్ ఖాన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట, సెప్టెంబర్ 17 : అమరుల త్యాగాల ఫలితంగానే స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దిన్సోవంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవందనం స్వీకరించారు.
భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.