నీలగిరి, మార్చి9 : ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నా రు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం నల్లగొండ జిల్లా తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం 2024 డైరీ, క్యాలెండర్‌ను ఆవిషరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రతి పేదవాడికి చేరే విధంగా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుందని తెలిపారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో టీఎన్జీఓస్ భవనాన్ని పూర్తి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఎన్జీఓస్ మాజీ అధ్యక్షుడు ఎడుదొడ్ల వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగిళ్ల మురళి, జేజాల శేఖర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ ఫోరమ్ అధ్యక్ష, కార్యదర్శులు, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భిక్షం, అంగన్వాడీ,ఆశ కార్యకర్తల యూనియ న్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.