Congress | పాలన గాలికి.. మంత్రులు ఢిల్లీకి.. పదవుల కోసం సగం క్యాబినెట్ హస్తినలోనే పొర్లుదండాలు
Congress | రాష్ట్రంలో ఓవైపు వివిధ వర్గాల వారు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి ఆందోళన బాట పడితే.. పరిపాలన గాలికి వదిలి సీఎం సహా మంత్రులు మాత్రం ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. పెండింగ్ డీఏల కోసం ఉద్యోగులు నిరసనకు దిగుతున్నారు.
Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఓవైపు వివిధ వర్గాల వారు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి ఆందోళన బాట పడితే.. పరిపాలన గాలికి వదిలి సీఎం సహా మంత్రులు మాత్రం ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. పెండింగ్ డీఏల కోసం ఉద్యోగులు నిరసనకు దిగుతున్నారు. జీవో 97ను రద్దు చేయాలని ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డుమీదికి వచ్చారు. ధరణి పోర్టల్‌లో లోపాలు, 22(ఏ) వివాదాలతో రైతులు, మధ్యతరగతి ప్రజలు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట పడిగాపులు కాస్తున్నారు.
ఈ క్రమంలో పాలకులు మాత్రం అధికార పీఠాల లెకలు తేల్చుకోవడంలో మునిగిపోయారు. పీఠాలను పదిలపరుచుకోవడం కోసం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి చెక్కేస్తున్నారు. క్యాబినెట్‌లోని సగానికి పైగా మంత్రులు ఢిల్లీ బాట పట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కీలక శాఖల మంత్రులంతా ఢిల్లీ రాజకీయాల్లో తలమునకలవడంతో రాష్ట్ర పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది. సచివాలయం వెలవెలబోతున్న ది. ఈ నెల 4 వరకు సీఎం, మంత్రులు రాష్ట్రంలో అందుబాటులో ఉండకపోవచ్చ ని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. గందరగోళ పరిస్థితుల్లో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన పాలకులు హస్తిన విమానాలు ఎకడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమస్యలు పట్టని మంత్రులు
రాష్ట్రంలో సమస్యలు గుట్టలుగా పేరుకుపోతున్నా లెకచేయని మంత్రులు, సీనియర్ నేతలు ఏఐసీసీ పెద్దల చుట్టూ ప్రదక్షిణ చేయడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, తుమ్మ ల నాగేశ్వర్రావు సహా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ తదితరులు మంగళవారమే ఢిల్లీకి చేరుకున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఢిల్లీకి పయనమయ్యారు. వీరితోపాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు కీలక ఎమ్మెల్యేలు సైతం ఢిల్లీలోనే మకాం వేసి అధిష్ఠానం వద్ద తమ లాబీయింగ్‌ను ముమ్మరం చేశారు.
భయంభయంగా హస్తినలో
తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళన, విస్తరణ ఖాయమన్న ప్రచారం ఊపందుకోగా నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల భర్తీ తదితర అంశాలపై హైకమాండ్ దృష్టి సా రించింది. ఈ క్రమంలో మంత్రుల పనితీరు, శాఖల మార్పులు, సామాజిక సమీకరణాలపై మంత్రులు, సీనియర్ల అభిప్రాయాలను ఏఐసీసీ సేకరిస్తున్నది. ఈ నేపథ్యంలో పదవులు దకుతాయో? ఊడుతాయో? అనే భయంతో హైదరాబాద్‌లో నే మిగిలిన ఇతర మంత్రులు కూడా తీవ్ర ఉతంఠకు గురవుతున్నారు.
సురేఖను పిలిచిన అధిష్ఠానం
ఇటీవల పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా సాగిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖపై టీపీసీసీ క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేసిం ది. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆమెను ఢిల్లీకి పిలిపించింది. మంగళవారం రాత్రే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ ఖరారైనా అనివార్య కారణాలతో అపాయింట్మెంట్ తదుపరి రోజు ఉదయానికి వాయిదా పడింది. ఆమె నుంచి నేరుగా వివరణ తీసుకొని, తదుపరి చర్యలపై అధిష్ఠానం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 20 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

