సూర్యాపేట రూరల్, జనవరి 18 : 2014కు మందు రామరాజ్యం అని చెప్పి అధికారం లోకి వచ్చిన బీజేపీ, తొమ్మిదేండ్లుగా రాక్షస పాలన చేస్తున్నదని, బీజేపీకి ప్రజలు రాం రాం చెప్పబోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని సోలిపేట గ్రామం నుంచి ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగసభకు కార్యకర్తలతో కలసి లారీలో వెళ్లారు. అంతకు ముందు విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం సభతో దేశంలో రాజకీయంగా పెను మార్పులు తథ్యం అన్నారు.
బీజేపీ పాలనలో దేశంలో ఆకలి కేక లు మినహా ప్రజలకు ఒరిగిందేమి లేదన్నా రు. ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా విఫలమైందన్నారు. బీజేపీ లేతర రాష్ర్టాలతో అభివృద్ధ్దిని అడ్డుకోవడానికి చేస్తున్న దుర్మార్గాపు ప్రయత్నాలను వివరించడానికి ఇతర రాష్ర్టాల సీఎంలు సైతం ఖమ్మం సభకు వస్తున్నారని మంత్రి అన్నారు. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న బీజేపీ దుర్మార్గాలను ప్రజలకు వివరిస్తామన్నారు.