నకిరేకల్, సెప్టెంబర్ 29 : నకిరేకల్ పట్టణంలో శుక్రవారం వైద్య, ఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శుక్రవారం అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నకిరేకల్‌లో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికిఆరు. అంతకుముందు మంత్రులకు జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి,ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, చిరుమర్తి ఫౌండేషన్ చైర్మన్ చిరుమర్తి మనోజ్‌కుమార్ భారీ గజమాలతో సన్మానించారు అనంతరం పుష్పగుచ్ఛం అందజేశారు.
సభ విజయవంతం
నకిరేకల్‌లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతమైంది. కేతెపల్లి, కట్టంగూర్, నకిరేకల్, నార్కట్‌పల్లి, చిట్యాల మండలాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. తోరణాలు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగులతో ప్రధాన రహదారుల వెంట సందడి వాతావరణం నెలకొంది. దారిపొడవునా వైద్య ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు గులాబీ పూలు చల్లి అభిమానాన్ని చాటుకున్నారు.
రామన్నపేటలో..
రామన్నపేట :రామన్నపేటలో శుక్రవారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, పటాకులు పేల్చుతూ, ఆటపాటలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పా ల్గొన్న మంత్రులు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతిబలరాం, జడ్పీటీసీ పున్నలక్ష్మీజగన్మోహన్, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి పోశబోయిన మల్లేశం, మార్కెట్ కమిఈ వైస్ చైర్మెన్ కంభంపాటి శ్రీనివాస్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, సర్పంచులు గుత్తా నర్సిరెడ్డి, ఎడ్ల మహేందర్‌రెడ్డి, పిట్ట కృష్ణారెడ్డి, అప్పం లక్ష్మీనర్సు, గోదాసు శిరీష, మెట్టు మహేందర్‌రెడ్డి, రేఖ యాదయ్య, బందెల యాదయ్య, కోళ్ల స్వామి, ఎంపీటీసీలు తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, గొరిగె నర్సింహ, వేమవరపు సుధీర్‌బాబు, గాదె పారిజాత, వనం హర్షిని, దోమల సతీశ్,ఆవుల నరేందర్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పోతరాజు సాయి, జాడ సంతోష్ పాల్గొన్నారు.
చిట్యాలలో ..
చిట్యాల : హైదరాబాద్ నుంచి రామన్నపేటకు వెళ్తున్న మంత్రి తన్నీరు హరీశ్ రావుకు శుక్రవారం చిట్యాలలో ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. మంత్రి, ఎంపీ బడుగులను వాలువాలతో సన్మాని ంచారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, నాయకులు పాల్గొన్నారు.