బొడ్రాయిబజార్, డిసెంబర్ 3 : సూర్యాపేట అసెంబ్లీ నియోజకర్గ ఫలితం సాఫీగా సాగింది. రెండు మూడు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలో బీఆర్ఎస్ మెజార్టీ కనబర్చి విజయాన్ని సాధించింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మొదటగా బ్యాలెట్ ఓట్లు లెక్చించాక పట్టణం, మండలాలకు చెందిన ఓట్లను 20రౌండ్లుగా చేసి లెక్కించారు. ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్, చివరి మూడు రౌండ్లు మినహా అభ్యర్థుల్లోనే గాక ప్రజల్లో ఎలాంటి టెన్షన్ లేకుండా గెలుపు నిర్దారణ జరిగి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి వరుసగా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించారు. మొదటి రౌండ్లో బీఆర్ఎస్కు 4386 ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 4418, బీజేపీ 1579 ఓట్లు రావడంతో 32ఓట్లతో కాంగ్రెస్ లీడ్‌లో ఉంది.
ఈ సమయంలో అభ్యర్థు ల్లో ప్రజల్లో కొంత టెన్షన్ ఏర్పడింది. మొదటి రౌండే కాంగ్రెస్ కు లీడ్ రావడంతో నాయకులు, కార్యకర్తలు రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీస్తుందని ఇక్కడ ఆ ప్రభావం ఉంటుందోమోనని ఆందోళన నెలకొంది. రెండో రౌండ్లో బీఆర్ఎస్ 4,465, కాంగ్రెస్ 3,805, బీజేపీ 1,065 రాగా బీఆర్ఎస్ 660 లీడ్ సాధించడంతో కొంత టెన్షన్ వీడిం ది. మూడో రౌండ్లో బీఆర్ఎస్ 4,467, కాంగ్రెస్ 3,512, బీజేపీ 2241 రాగా బీఆర్ఎస్ 995ఓట్లతో లీడ్, నాలుగోరౌండ్లో బీఆర్ఎస్ 4,012, కాంగ్రెస్ 2,938, బీజేపీ 2,037 రాగా బీఆర్ఎస్ 1,074లీడ్, ఐదో రౌండ్లో బీఆర్ఎస్ 3,863, కాంగ్రెస్ 3,047, బీజేపీ 2,537 రాగా బీఆర్ఎస్ 816లీడ్, 6వ రౌండ్లో బీఆర్ఎస్ 3,802, కాంగ్రెస్ 2,909, బీజేపీ 2,377 రాగా బీఆర్ఎస్ 893లీడ్, 7వ రౌండ్ బీఆర్ఎస్ 2,288, కాంగ్రెస్ 2,282, బీజేపీ 2,942 రాగా ఇక్కడ బీజేపీ 654లీడ్ ఇవ్వడంతో ఇక బీజేపీ లీడ్ మొదలైంది అనుకు న్నారు. కానీ అంతలోనే 8వ రౌండ్లో బీఆర్ఎస్ 3,617, కాంగ్రెస్ 3,235, బీజేపీ 2,873 రాగా బీఆర్ఎస్ తిరిగి 382 లీడ్‌లోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
9వ రౌండ్లో బీఆర్ఎస్ 3,417, కాంగ్రెస్ 3,287, బీజేపీ 2,900 రాగా బీఆర్ఎస్ 130 లీడ్ ఇచ్చింది. 10వ రౌండ్లో బీఆర్ఎస్ 3,877, కాంగ్రెస్ 3,464, బీజేపీ 2,438రాగా బీఆర్ఎస్ 413లీడ్, 11వ రౌండ్లో బీఆర్ఎస్ 3,880, కాంగ్రెస్ 3,5 20, బీజేపీ 1,980 రాగా బీఆర్ఎస్ 360లీడ్, 12వ రౌండ్లో బీఆర్ఎస్ 4,040, కాంగ్రెస్ 3,683, బీజేపీ 1,314 రాగా బీఆర్ఎస్ 357లీడ్ రావడంతో 12వ రౌండ్ పూర్తి అయ్యే సరికి మంత్రి జగదీశ్‌రెడ్డి 6,014ఓట్ల మెజార్టీతో ఉన్నారు. 13వ రౌండ్లో బీఆర్ఎస్ 3,832, కాంగ్రెస్ 4,192, బీజేపీ 1,682 రాగా కాంగ్రెస్ 360 లీడ్ రావడంతో కొంత ఆసక్తి రేపింది. 14వ రౌండ్లో బీఆర్ఎస్ 4,286, కాంగ్రెస్ 4,094, బీజేపీ 1,683 రాగా బీఆర్ఎస్ 192 లీడ్, 15వ రౌండ్లో బీఆర్ఎస్ 4,280, కాంగ్రెస్ 4,029, బీజేపీ 1,597 రాగా బీఆర్ఎస్ 251లీడ్,
16వ రౌండ్లో బీఆర్ఎస్ 3,959, కాంగ్రెస్ 3,514, బీజేపీ 2,480 రాగా బీఆర్ఎస్ 445లీడ్, 17వ రౌండ్లో బీఆర్ఎస్ 3,303, కాంగ్రెస్ 3,618, బీజేపీ 1,768 రాగా కాంగ్రెస్ 315లీడ్, 18వ రౌండ్లో బీఆర్ఎస్ 3,579, కాంగ్రెస్ 4,008, బీజేపీ 1,850 రాగా కాంగ్రెస్ 429 లీడ్, 19వ రౌండ్లో బీఆర్ఎస్ 3,874, కాంగ్రెస్ 4,137, బీజేపీ 2,285 రాగా కాంగ్రెస్ 263 లీడ్, 20వ రౌండ్లో బీఆర్ఎస్ 1,206, కాంగ్రెస్ 991, బీజేపీ 453 రాగా బీఆర్ఎస్ 215ఓట్లతో తిరిగి లీడ్‌లోకి వచ్చారు. పోస్టల్ బ్యాలెట్లో బీఆర్ఎస్703, కాంగ్రెస్ 1,846, బీజేపీ 326ఓట్లు పోలయ్యా యి. మొత్త్తంగా బీఆర్ఎస్ 75,136, కాంగ్రెస్ 70,531, బీజేపీ 40,398 ఓట్లు పోల్ కాగా 4,606ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిపై ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్‌తో పాటు చివరి మూడు రౌండ్లలో కాంగ్రెస్ లీడ్ ఇవ్వడంతో కొంత ఉత్కంఠ నెలకొన్నప్పటికీ మిగతా రౌండ్లన్నీ రౌండ్ రౌండ్‌కు బీఆర్ఎస్కు లీడ్ రావడంతో ఎలాంటి టెన్షన్ లేకుండా జగదీశ్‌రెడ్డి గెలుపు ఖరారైంది.
సూర్యాపేట నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ మెజార్టీ సాధించింది. మొత్తం 3,120 పోస్టల్ బ్యాలెట్‌కు గాను బీఆర్ఎస్ 703, కాంగ్రెస్ 1,846, ఇతరులు 141 వచ్చాయి. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్పై 1,143ఓట్ల మెజార్టీ సాధించింది.