చివ్వెంల, మే 15 : మిల్లర్లు ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. గురువారం చివ్వెంల మండలం వల్లభపురంలోని జగన్ మాత రైస్ ఇండస్ట్రీస్, దురాజ్‌పల్లి నవరత్న రైస్ ఇండస్ట్రీస్, సూర్యాపేట మండలం ఇమాంపేటలోని నల్లగొండ రైస్ ఇండస్ట్రీస్ లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిల్లుల్లో ధాన్యం దిగుమతి ఆలస్యం కావడంతో లారీలు సకాలంలో లభించక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. కావునా లారీలను వైయిటింగ్ చేపించకుండా, ఎక్కువ మంది హమాలీలను నియమించుకుని ధాన్యం వెంటనే దిగుమతి చేసుకుని లారీలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకి పంపాలని మిలర్ల యజమాన్యాన్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డీటీ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.