అర్వపల్లి, ఏప్రిల్ 24 : కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని, మిల్లర్లు కూడా ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. గురువారం అర్వపల్లి మండలం రామన్నగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఈ సెంటర్ ద్వారా 1,680 క్విoటాల ధాన్యాన్ని మిల్లులకి ఎగుమతి చేసినట్లు తెలిపారు. రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి, తేమ శాతం 17 ఉండేలా కొనుగోలు కేంద్రాలకి తీసుకు రావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకి ముందుగా వచ్చిన ధాన్యం ప్రకారం సీరియల్ నంబర్లు ఇవ్వాలని పేర్కొన్నారు.