మునుగోడు, మే 02 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో దేశంలో జనగణనతో పాటు కుల గణన చేపట్టనుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మాదగోని నరేందర్ గౌడ్. సీనియర్ నాయకులు బొల్గురి రమేశ్, పందుల నర్సంహ్మ, నీరుడు రాజారాం, మాజీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎం.డి మాజీద్, మండల ప్రధాన కార్యదర్శి అక్కెనపల్లి సతీశ్, మండల కార్యవర్గ సభ్యుడు విష్ణు, దళిత మోర్చా మండల అధ్యక్షుడు పందుల యాదయ్య, జక్కల కృష్ణ, పోలే వెంకటేశ్వర్లు, పిట్టల రాములు, బొజ్జ రాములు పాల్గొన్నారు.