నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మద్దతుగానే వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం రామన్నపేట మండలం నిదాన్పల్లి గ్రామం, నకిరేకల్ మండలం గోరెంకపల్లి గ్రామం నుంచి వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
Whatsapp Image 2023 07 08 At 11.54.25 (4)
వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చోటు లేదన్నారు. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో చేరిన వారిలో చల్ల మల్లమ్మ, చల్ల శ్రీకాంత్, బొడ్డుపల్లి తిరుపతి, ఆగు లింగస్వామి, కొంగలి యేసు, జానయ్య, సైదులు, రాజు, రవి, నాగరాజు తదితరులు ఉన్నారు.