రామగిరి, జూన్ 19 : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (MGU) పరిధిలోని యూజీ (డిగ్రీ) పలు సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్/మే నెలల్లో నిర్వహించిన యూజీ II, IV, VI సెమిస్టర్ల రెగ్యులర్ & బ్యాక్లాగ్ పరీక్షలతో పాటు I, III, V సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి, రిజిస్టర్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవితో కలిసి వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. విద్యార్థులు తమ ఆన్లైన్ మార్క్స్ మెమోలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ www.mguniversity.in లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాల విడుదలలో యూనివర్సిటీ పరీక్షల విభాగం అసిస్టెంట్ కంట్రోలర్లు డాక్టర్ లక్ష్మీప్రభ, డాక్టర్ ఏ. ప్రవళిక, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ కళ్యాణి, పరీక్షల విభాగం కో ఆర్డినేటర్ డాక్టర్ భిక్షమయ్య పాల్గొన్నారు.
6వ సెమిస్టర్ (రెగ్యులర్/బ్యాక్లాగ్) : ఈ పరీక్షలకు మొత్తం 6,307 మంది విద్యార్థులు హాజరు కాగా, 3,373 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 53.48% గా నమోదైంది. 2,908 మంది ప్రమోట్ అయ్యారు.
5వ సెమిస్టర్ (బ్యాక్లాగ్) : 2,589 మంది హాజరుకాగా, 1,224 మంది ఉత్తీర్ణత సాధించారు (47.28%).
4వ సెమిస్టర్ (రెగ్యులర్/బ్యాక్లాగ్) : 6,866 మంది హాజరుకాగా, 2,970 మంది ఉత్తీర్ణులయ్యారు (43.26%). 186 మంది విద్యార్థులు డిటైన్ అయ్యారు.
3వ సెమిస్టర్ (బ్యాక్లాగ్) : 3,071 మంది హాజరుకాగా, 1,003 మంది పాస్ అయ్యారు (32.66%).
2వ సెమిస్టర్ (రెగ్యులర్/బ్యాక్లాగ్) : 9,170 మంది హాజరుకాగా, 2,979 మంది ఉత్తీర్ణత సాధించారు (32.49%). అత్యధికంగా 787 మంది విద్యార్థులు డిటైన్ అయ్యారు.
1వ సెమిస్టర్ (బ్యాక్లాగ్) : 4,311 మంది హాజరుకాగా, కేవలం 1,076 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు (24.96%). 3,210 మంది విద్యార్థులు ప్రమోట్ అయ్యారు.
మాల్‌ప్రాక్టీస్ కేసులు : ఈ పరీక్షల్లో వివిధ సెమిస్టర్లలో కలిపి మొత్తం 159 మాల్‌ప్రాక్టీస్ (కాపీయింగ్) కేసులు నమోదైనట్లు విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు.