– అభినందించిన వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అరుణప్రియ
రామగిరి, డిసెంబర్ 03 : గుజరాత్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ యూనివర్సిటీలో గత నెల 22 నుండి వారం రోజుల పాటు నిర్వహించిన జాతీయ సమైక్యత శిబిరం (National Integration Camp – NIC) లో నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి చెందిన ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సరం విద్యార్థి కాట్రావత్ గణేశ్ ప్రతిభ చూపి యునివర్సిటీ ఖ్యాతి చాటాడు. రాష్ట్ర వర్సిటీల ప్రతినిధిగా ఎంపికైన గణేశ్ శిబిరంలో నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తన కళా సమర్థత, నాయకత్వ నైపుణ్యాలతో అందరిని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డప్పు దరువు, బతుకమ్మ, బోనాలు, పోతరాజు విన్యాసాల ప్రదర్శనతో మంత్రముగ్ధులను చేసి అందరి ప్రశంసలను అందుకున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం విద్యార్థికి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ ప్రియతో పాటు అధ్యాపకులు, సహచర విద్యార్థులు అభినందనలు తెలిపారు.