రామగిరి, ఫిబ్రవరి 04 : సీఎం రేవంత్రెడ్డి మిర్యాలగూడ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన చేయకపోయినా బుధవారం తెల్లవారుజామునే మహాత్మాగాంధీ యూనిర్సిటీ హాస్టళ్లలోకి పోలీసులు వెళ్లి విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల చర్యపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రజల మధ్యకు రావాల్సిన నాయకుడు పోలీసు బలగాల అండతో పర్యటనలు నిర్వహించడం ఆయనకు విద్యార్థి ఉద్యమాలపై ఉన్న భయాన్ని చూపిస్తోందని విమర్శించారు.
ప్రశ్నించే స్వరాలను అణచివేయడానికి అక్రమ అరెస్టులు చేయడం సరైన విధానం కాదన్నారు. ఇలాంటి చర్యలతో విద్యార్థి ఉద్యమాలను ఎప్పటికీ ఆపలేరన్నారు. విద్యార్థుల అభిప్రాయాలు, నిరసనలు ప్రజాస్వామ్యంలో భాగమని, వాటిని అణచివేయాలని చూసిన నాయకులు చరిత్రలో నిలవలేదని హెచ్చరించారు. సంభాషణకు బదులుగా నిర్బంధాన్ని ఎంచుకోవడం ప్రజాస్వామ్యానికి ముప్ప అని పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షులు వాడపల్లి నవీన్, ఏబీవీపీ అధ్యక్షుడు హనుమాన్ చారి, ఎస్ఎఫ్ఐ నాయకుడు కర్రెం రవికుమార్ తదితరులు ఉన్నారు.

CM Revanth Tour : ఎంజీయూ విద్యార్థి నాయకుల ముందస్తు అరెస్ట్