నల్గొండ విద్యా విభాగం (రామగిరి), మార్చి 25 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో మంగళవారం యూనివర్సిటీ సాఫ్ట్ బాల్ జట్టును ఎంపిక చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ, పీజీ కళాశాల నుంచి విద్యార్థులు హాజరై పోటీల్లో ప్రతిభ చూపారు. ఉత్తమ ప్రతిభ చూపిన 16 మంది విద్యార్థులను యూనివర్సిటీ జట్టుకు ఎంపిక చేసినట్లు వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డాక్టర్ హరీశ్‌కుమార్ తెలిపారు.
అనంతరం విద్యార్థులను యూనివర్సిటీ ఖేలో ఇండియా ప్రాజెక్ట్ ప్రొఫెసర్ సోమలింగంతో కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ వై.శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ ఆర్.మురళి, స్పోర్ట్స్ బోర్డ్ కో ఆర్డినేటర్ డాక్టర్ చింత శ్యామ్‌సుందర్, కోచ్‌లు నాగిరెడ్డి, పృథ్వీరాజ్, అజయ్ పాల్గొన్నారు.