రామగిరి, సెప్టెంబర్ 12 : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిర్వహించిన ఐసీటీ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపి యూనివర్సిటీ టీమ్‌కు ఎంపికై, జరగబోయే ఐయూటీ (అంతర యూనివర్సిటీ టోర్నమెంట్) కు జాతీయ స్థాయిలో వెళ్లే విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి వర్సిటీ ఖ్యాతి చాటాలని ఎంజీయూ ఐక్యూఎసీ డైరెక్టర్ డా.మిర్యాల రమేశ్ కుమార్, స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ డా.హరీశ్ కుమార్ అన్నారు. వర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శుక్రవారం వర్సిటీ టీమ్‌కు ఎంపికైన చెస్ స్త్రీ, పురుషుల టీమ్ విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మనిషి మేథస్సును పెంచే క్రీడ చెస్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ బోర్డు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డా.రామావత్ మురళి, డా.వై.శ్రీనివాసరెడ్డి, కోఆర్డినేటర్ శివశంకర్, కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.శంకరయ్య, వివిధ కళాశాల పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
-స్త్రీల విభాగంలో ఎం.ధరణి, డి.ఉమా, బి.కీర్తన- టీజీఎస్ డబ్ల్యూ ఆర్ఎఎఫ్పీడీసీడబ్ల్యూ- భువనగిరి, బి.భవిత, జి.వెన్నల టీజీఎస్ డబ్ల్యూఆర్టీసీడబ్ల్యూ- సూర్యాపేట, నిజ్రా ఇమాన్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల – నల్లగొండ.
పురుషుల విభాగంలో కె.కామేశ్, జి.శ్రావణ్ కుమార్- యూసీఈటీ- ఎంజీయూ, సిహెచ్.శ్రీకాంత్ ఎస్టీ డిగ్రీ కళాశాల సూర్యాపేట, కె.నాగరాజు- నీలగిరి డిగ్రీ అండ్ పీజి కళాశాల- నల్లగొండ, బి. నాగరాజు- యూసీఎస్ ఎంజీయూ, ఎన్. అంబ్రేష్ యూసీఎఎస్ఎస్- ఎంజీయూ.
Ramagiri ; జాతీయ స్థాయిలో ఎంజీయూ ఖ్యాతి చాటాలి : మిర్యాల రమేశ్ కుమర్