నల్లగొండ రూరల్, ఫిభ్రవరి 19 : రాష్ట్ర విశ్వ విద్యాలయ అభివృద్ధి కోసం కేంద్ర పభుత్వ విద్యాశాఖ రూపొందించిన ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్ష అభియాన్ పథకం కింద ఎంజీయూకు రూ. 20 కోట్ల నిధులు మంజూరైనట్లు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ గోపాల్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ వ్యాప్తంగా విశ్వ విద్యాలయాలకు రూ.1,296 కోట్లు విడుదల చేయగా అందులో ఎంజీయూకు రూ.20 కోట్లు వచ్చాయని పేర్కొన్నారు.
ఈ నిధులను బాలికల హాస్టళ్ల నిర్మాణం, అధునాతన ల్యాబ్స్, విద్యార్థుల నైపుణ్య అభివృద్ధి కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. విశ్వ విద్యాలయాలు పంపిన అభివృద్ధి ప్రణాళికలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఈ పథకాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మంగళవారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో యూన్సివర్సిటీలకు వివరాలు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.