– వీసీ, రిజిస్ట్రార్, పలు బీఈడీ కళాశాల యాజమాన్యాల సంతాపం
రామగిరి, మే 19 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యా విభాగం డీన్ ప్రొఫెసన్ రామకృష్ణ ఆకస్మిక మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. రామకృష్ణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యా విభాగం డీన్‌గా, ఎడ్‌సెట్ కన్వీనర్‌గా, వివిధ హోదాల్లో పనిచేసి సుదీర్ఘకాలం సేవలందించారు. ఓయూలో 2023లో రిటైర్డ్ అయిన తర్వాత ఎంజీయూ విద్యావిభాగం డీన్‌గా నియామకమై బీఈడీ విద్య వ్యాప్తిలో విస్తృత సేవలందించారు. రామకృష్ణ మృతి పట్ల ఎంజీయూ వీసీ, రిజిస్ట్రార్, పలు బీఈడీ కళాశాల యాజమాన్యాలు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులు సంతాపం తెలిపారు.