నల్లగొండ విద్యావిభాగం (రామగిరి), ఏప్రిల్ 10 : నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలోని విద్యార్థులకు ఈ నెల 11, 15, 16న జరిగే డిగ్రీ పలు సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి.ఉపేందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఇప్పటికే వెల్లడించిన టైమ్ టేబుల్లో 16వ తేదీ తర్వాత జరగాల్సిన పరీక్షలన్నీ యధావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.
ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ కోసం చేస్తున్న నిరవధిక నిరసనలో భాగంగా వారి వినతి మేరకు యూనివర్సిటీ వీసీ ఆదేశాలతో పరీక్షలు వాయిదా వేయడం జరిగిందన్నారు. వాయిదా పడిన పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు ఈ అంశాన్ని గమనించాలని కోరారు.