రామగిరి, జూన్ 05 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మే 14న ప్రారంభమైన డిగ్రీ పలు సెమిస్టర్స్ పరీక్షలు గురువారం ముగిశాయి. చివరి రోజు జరిగిన 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు 114 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 85 మంది హాజరయ్యారు. 29 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణపై ఎంజీయూ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి స్పందిస్తూ.. మూల్యాంకనం ప్రక్రియ త్వరలోనే ప్రారంభించి విద్యార్థులు పై చదువులకు వెళ్లే విధంగా త్వరితగతిన ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరీక్షల నిర్వహణలో అంకితభావంతో పనిచేసి విజయవంతం చేయడంలో కృషి చేసిన స్క్వాడ్ టీంతో పాటు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్స్, ఇన్విజిలేటర్స్, వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.