దేవరకొండ రూరల్, జూన్ 07 : దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం దేవరకొండ మండలం రత్యతండా, ఎల్లారెడ్డిబావి గ్రామంలోఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, రమావత్ గోపి, వడ్త్యా గణేష్, నరేశ్, రాజు, శ్రీను పాల్గొన్నారు.
Devarakonda Rural : దైవ చింతనతో మానసిక ప్రశాంతత : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్