నీలగిరి, మే 20 : కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో మందుల అమ్మకాలు, ప్రత్యేక డిస్కౌంట్లు, నాసిరకం మందులకు వ్యతిరేఖంగా నల్లగొండ మెడికల్ కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మెడికల్ దుకాణాల బంద్ సజావుగా జరిగింది. స్వచ్చంధంగా మెడికల్ దుకాణాల యాజమానులు తమ దుకాణాలకు తాళాలు వేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అద్యక్షుడు చిలుకూరి పరమాత్మ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 2018లో ఆన్లైన్లో మందుల అమ్మకాల కోసం తెచ్చిన జీఎస్ఆర్ 817ను, అలాగే కార్పొరేట్ వారికి ప్రత్యేక డిస్కౌంట్లు, నాసిరకం మందులు, మార్కెట్లోకి అవకాశం కల్పించిందన్నారు. కానీ వాటిపై కేంద్ర ప్రభుత్వానికి పలు మార్లు విన్నవించినప్పటికీ స్పందించక పోవడంతో జాతీయ సంస్థ ఏఐఓసీడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఒకరోజు బంధ్ పాటిస్తున్నామని చెప్పారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల డెలివరీ జరుగుతోందన్నారు. ఫలితంగా నకిలీ మందులు, గడువు ముగిసిన మెడిసిన్ విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. 24 గంటలు ప్రజలకు సేవ చేస్తున్న స్థానిక మెడికల్ షాపులను కాపాడాలని, ఆన్లైన్ ఫార్మసీల వల్ల చిన్న మెడికల్ షాపులు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొంపెల్లి గోవర్ధన్, కోశాధికారి చిలుకూరి వెంకటేశ్వర్లు, నల్లగొండ పట్టణ అధ్యక్షులు పోషం రఘుపతి, ప్రధాన కార్యదర్శి వల్లందాస్ శ్రీనివాసులు, కోశాదికారి గంగిశెట్టి వెంకటేశ్వర్లు, వాలుగొండ శ్రవణ్ కుమార్, గండూరి శ్రీనివాస్, చిలుకూరి పవన్‌కుమార్, చిదురాల శ్రీనివాస్, మిర్యాల ధనంజయ, రాపోలు లక్ష్మినారాయణ, సిరిప్రోలు రాధాకృష్ణ, హరినాద్, సుదర్శన్, ప్రసాద్, ప్రవీణ్, రామదాస్, గొషిక శ్రీనివాస్, గంజి భువనేశ్వర్, వనం గణేశ్, మిర్యాల శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, వల్లందాస్ ప్రవీణ్, మత్యగిరి, అయిటిపాముల రవీందర్, జగిని చంద్ర శేఖర్, అప్పం హరి కుమార్, గంజి శ్రీనివాస్, బొల్లేద్దు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఏఐఓసీడీ తలపెట్టిన అల్ ఇండియా మెడికల్ షాప్ ల బంద్‌కి తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (టీఎంఎస్‌ఆర్‌యూ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్, నిరంజన్, పోలా రమేష్, జిల్లా కార్యదర్శి స్వామి, అధ్యక్షుడు హరిప్రసాద్, కోశాధికారి జీవన్, ఉప కార్యదర్శి నరేంద్ర ఉప అధ్యక్షుడు అనిల్, శ్రీహరి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్లో మందుల అమ్మకాలు, అధిక తగ్గింపు ధరల వల్ల మెడికల్ షాప్ నిర్వాహకులు అధిక నష్టలు భరించలేక షాప్‌లను మూసివేయల్సి వస్తుందన్నారు. ఆన్లైన్ మందులు అంత శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యునియన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.