సోమ భరత్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్
తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌గా నాగారం మండలం వర్ధమానుకోటకు చెందిన సోమ భరత్‌కుమార్ గురువారం హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు
తెలిపారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తోపాటు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు కలిసి అభినందనలు తెలిపారు. ప్రముఖ న్యాయవాదిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి భరత్ సీఎం కేసీఆర్ వెంట నడిచిన సంగతి తెలిసిందే. భరత్‌కుమార్ బాధ్యతల స్వీకరణతో కార్పొరేషన్ చైర్మన్ పదవులు పొందిన ఉమ్మడి జిల్లా నేతల సంఖ్య ఐదుకు చేరింది.
సోమ భరత్‌కు శుభాకాంక్షలు
తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా సోమ భరత్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, నల్లమోతు భాస్కర్‌రావు, షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.