మునుగోడు, మే 1: ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మునుగోడు కేంద్రంలో మే డే (May Day) ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సీపీఐ అనుబంధ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, మిల్లు హమాలీ కార్మిక సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం, మార్కెట్, సెంట్రింగ్, ఆటో, చిరు వ్యాపారాల సంఘాల ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు జిల్లా కార్యదర్శి గురుజ రామచంద్రం, జిల్లా కార్యవర్గ సభ్యులు తిర్పరీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవాలంటే కార్మికులంతా ఐకమత్యంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు, సురిగి చలపతి, పార్టీ మండల కార్యదర్శి చాపల శ్రీను, మాజీ జడ్పీటీసీ గోసుకొండ లింగయ్య, మండల సహాయ కార్యదర్శులు బండమీది యాదయ్య, మందుల పాండు, ఏఐటీయూసీ మండల అధ్యక్ష కార్యదర్శులు దుబ్బ వెంకన్న, బెల్లం శివయ్య, మండల కార్యవర్గ సభ్యులు ఈదులకంటి కైలాస్ , ఎండీ జానీ, కురుమర్తి ముత్తయ్య, ప్రజా సంఘాల నాయకులు ధాం ఖాసిం, వార్రే ముత్తయ్య, బోయపర్తి యాదయ్య, పందుల చిన్న నరసింహ , బేమనపల్లి స్వామి, గిరి, చిరువ్యపరుల నాయకులు , ప్రేమలత, అండాలు, రేణుక, యట పద్మ, యువజన విద్యార్థి సంఘాలు నాయకులు కట్ట దశరథ, పులకరం ఆంజనేయులు , చాపల విప్లవ్ కుమార్, రమేష్ బొడ్డు వినోద్ తదితరులు పాల్గొన్నారు.