ఖమ్మం రూరల్, ఆగస్టు 19 : ఖమ్మం రూరల్ మండలం కొండాపురం పంచాయతీ పరిధిలోని సీతారామపురం గ్రామానికి చెందిన మట్టా శైలజ కుమారి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్నారు. మంగళవారం ఓయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ చేతుల మీదుగా ఆమె డాక్టరేట్ అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో రసాయన శాస్త్రం విభాగంలో డాక్టర్ బి. విజయచరణ్ ఆధ్వర్యంలో నానో క్రోమైట్స్ పైన చేసిన పరిశోధనకు ఆమెకు డాక్టరేట్ లభించింది.