కోదాడ, ఆగస్టు 22 : జీఎస్టీ చెల్లించకుండా నకిలీ వస్తువులు విక్రయిస్తూ, ప్రజలను మోసం చేస్తూ, స్థానిక వ్యాపారస్తుల పొట్ట కొడుతున్న మార్వాడీలు ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని స్థానిక వ్యాపారస్తులు కోదాడలో శుక్రవారం నిరసన తెలిపారు. దుకాణాలు మూసివేసి నకిలీ వస్తువులు అమ్మకాలు నిషేధించాలని ప్లకార్డులు చేబూని ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో పలు వ్యాపార సంఘాల నాయకులు మేళ్లచెరువు కిశోర్, కొత్తూరు కిశోర్, పెద్ది అంజయ్య చారి, వీరభద్ర చారి, వివిధ వ్యాపారాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.