కట్టంగూర్, అక్టోబర్ 21 : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మంగళవారం కట్టంగూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయిటిపాములలో అమరుడు చౌగోని నాగరాజు విగ్రహానికి పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కట్టంగూర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐ రవీందర్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎంతోమంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారన్నారు. విధుల్లో ప్రాణాలు వదిలిన వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఆయా కార్యక్రమాల్లో పెద్ది సుక్కయ్య, చౌగోని నాగరాజు, భద్రి నారాయణ, కొమ్ము కోటి, ఇటుకల గంగాధర్, సాయి కల్యాణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.