గుర్రంపోడు, ఏప్రిల్ 01 : నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుర్రంపోడు మండలంలోని మోసంగి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ ఎన్.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొంగరాల వెంకటమ్మ (49), ఆమె కుమారుడు శ్రీధర్ కొంతకాలం క్రితం చనిపోయాడు. అప్పటి నుండి ఆమె మానసిక స్థితి సరిగా లేక పిచ్చి పిచ్చిగా గ్రామంలో తిరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో మద్యం సేవించి తన ఇంటికి కొద్ది దూరంలో గల ఖాళీ స్థలంలో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు పెద్ద కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.