దేవరకొండ రూరల్, జూన్ 07 : తమ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేవరకొండ మండలం మర్రిచెట్టుతండా గ్రామ రైతులు శనివారం తాసీల్దార్ మధుసూదన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నేడు మండలంలోని కొండభీమనపల్లి గ్రామ రైతు వేదికలో అధికారులు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మర్రిచెట్టుతండా రైతులు తాసీల్దార్‌కు తమ సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో రైతులు పట్టా కలిగి ఉన్న పలు సర్వే నంబర్లు ఆన్లైన్లో కనిపించడం లేదన్నారు. కోర్టు డిగ్రీ రికార్డు ద్వారా పట్టా కలిగి ఉన్న రైతుల భూమిని సర్వే చేసి భూ రికార్డు ఆన్లైన్ నందు నమోదు చేసి పట్టా మంజూరు చేయాలని వారు కోరారు.