నీలగిరి, మే 2: ఏపీ, ఒరిస్సా నుంచి గంజాయి తెచ్చి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 5 కేజీల గంజాయి, ఐదు సెల్ఫోన్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ రమేశ్ తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ- హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఉడుపి హోటల్ పరిసర ప్రాంతాల్లో గంజాయి సరఫరా, అమ్మకాలు, తాగడం చేస్తున్నారని నమ్మదగిన సమాచారం అం దడంతో శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉడుపి హోటల్, దుర్గా వైన్స్ మధ్యలో ఉన్న వీధిలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రెండు బైక్‌లపై వచ్చిన ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించడంతో వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. నల్లగొండకు చెందిన కోరేపల్లి అభినవ్, రాములుబండకు చెందిన సింగపంగ రాకేశ్ @ రాఖీ, భదాద్రి కొత్తగూ డా నికి చెందిన మల్లె మోహన్ కృష్ణ, ధరావత్ రాజేశ్ నల్గొండలోని ఆర్టీసీ కాలనీకి చెందిన బత్తుల శివసాయి @ బొబోలుగా గుర్తించినట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాలో వీరితో పాలుపంచుకున్న కస్పారాజు నాగరాజు, గంటెకంపు మధుకుమార్, జూలకంటి విష్ణు వర్ధ న్, సంపత్ కుమార్, సుశాంత్ @ డెడ్లీ, మనుకర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
కోరేపల్లి అభినవ్ చిన్నప్పటి నుం చే నల్గొండలో తన స్నేహితులతో కలిసి గంజాయి తాగ డం, మందు తాగడం అలవాటు చేసుకున్నట్లు తెలిపారు. అతడి స్నేహితులు గంటెకంపు మధు కుమార్, కస్పారాజు నాగరాజుతో కలిసి చెడు వ్యసనాలకు అలవాటు పడి, డబ్బు కోసం పలు ప్రాంతాల్లో బైక్‌లు, పెట్రోల్ దొం గతనాలు చేసేవారన్నారు. అభినవ్ గంటెకంపు మధు కుమార్ వారం క్రితం విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీ చేసి ఏవోబీలోని సీలేరు పరిసర ప్రాంతాలకు వెళ్లి 12 కేజీ గంజాయి కొనుగోలు చేసి తెచ్చినట్లు తెలిపారు. కస్పారాజు నాగరాజు, జూలకంటి విష్ణు వర్ధన్, సంపత్, సుశాంత్@ డెడ్డీలకు ఒక్కో కేజీ చొప్పున నాలుగు కేజీలు విక్రయించినట్లు తెలిపారు. మిగిలిన ఎనిమిది కేజీల్లో మూడు కేజీలు మధు కుమార్ తన వద్దే ఉంచుకొని శనివారం కోరేపల్లి అభిరామ్, సింగపంగ రాకేశ్ మరో ఇద్దరితో కలిసి ఐదు కేజీల గంజాయిని కొత్తగూడానికి చెందిన ఇద్దరికి, నల్లగొండకు చెందిన మరొకరి విక్రయిస్తూ పట్టుబడినట్లు తెలిపారు.