చండూరు, అక్టోబర్ 23 : రాష్ట్రస్థాయి ఉడ్ బాల్, క్రికెట్ లెవన్ పోటీల్లో చండూరు మండల కేంద్రంలోని మరియానికేతన్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. భద్రాది కొత్తగూడెంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉడ్ బాల్ పోటీల్లో పాఠశాల విద్యార్థులు 3 బంగారు పతకాలు, 2 రజత పతకాలు సాధించడంతో పాటు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన క్రికెట్ లెవన్ పోటీల్లో పాఠశాల టీమ్ రాణించింది. పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను గురువారం పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ పద్మలత, ప్రిన్సిపాల్ సిస్టర్ కల్పన, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ గణేష్ పాల్గొన్నారు.
Chandur : రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో మరియానికేతన్ విద్యార్థుల ప్రతిభ