కట్టంగూర్, మార్చి 21 : కట్టంగూర్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి వసంత నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు శనివారం ఆంజనేయ స్వామికి వడమాల, తమలపాకుల పూజ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. లోక కల్యాణార్ధం వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య మన్యసూక్త హోమం, శ్రీరామ హోమం శాస్త్రోకంగా జరిగాయి. మొదట ఉత్సవమూర్తులకు షోడశోపదార పూజలు, శ్రీరామ హోమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రీరామడుగు శ్రీనివాస్ శర్మ శశిరేఖ, ఇల్లెందుల రాంమూర్తి సంధ్య, రెడ్డిపల్లి సైదులు సైదమ్మ దంపతులతో పాటు కడవేరు కృష్ణవేణి, రాపోలు లక్ష్మి, గుండు రూప, కోమటి సుశీల, బండారు నాగమ్మ, ప్రవళిక పాల్గొన్నారు.