Landslide | విరిగిపడ్డ కొండచరియలు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం
Landslide | భారీ వర్షాలకు కర్ణాటక రాష్ట్రం (Karnataka State) శివమొగ్గ జిల్లా (Shivamogga district) ఇందిరానగర్‌లో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు (ఇవాళ) ఓ కుటుంబం బలైంది. ఈ రోజు తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో మూడేళ్ల చిన్నారి ఉండటం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.
Landslide : భారీ వర్షాలకు కర్ణాటక రాష్ట్రం (Karnataka State) శివమొగ్గ జిల్లా (Shivamogga district) ఇందిరానగర్‌లో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు (ఇవాళ) ఓ కుటుంబం బలైంది. ఈ రోజు తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో మూడేళ్ల చిన్నారి ఉండటం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.
కొప్పల్ జిల్లా గంగావతి తాలుకా కొక్కరెగర గ్రామానికి చెందిన మల్లికార్జున్ (35) తన భార్య నాగవేణి (28), కుమారుడు సంతోశ్ (3) తో కలిసి ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే వారంతా నిద్రిస్తుండగా భారీ వర్షాలకు ఈరోజు తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. సరిగ్గా వారు నివాసం ఉంటున్న రేకుల షెడ్డుపై పడటంతో నిద్రలోనే వారంతా కన్నుమూశారు. మరోవైపు పక్కనున్న షెడ్డుపైనా మట్టి రాళ్లు వచ్చి పడటంతో అందులో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సేవల విభాగం, అగ్నిమాపక బృంద సభ్యులు రంగంలోకి దిగారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన బాధితుడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. కాగా మల్నాడు ప్రాంతంలో కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

