నిడమనూరు, ఆగస్టు 24 : సిపిఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను తండ్రి చంద్రయ్య అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు. సోమవారం నిడమనూరు తాసీల్దార్ జంగాల కృష్ణయ్య, మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు పోలె డేవిడ్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు బొజ్జ చిన్న మాదిగ, దళిత క్రైస్తవ సంఘం జిల్లా అధ్యక్షుడు పెదమాము రాజు సురేపల్లిలోని శ్రీను నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పరామర్శించిన వారిలో ఏఈఓ గుండెమెడ క్రాంతి కుమార్, రేషన్ డీలర్ నాగేశ్వరరావు ఉన్నారు.