మిర్యాలగూడ టౌన్, జనవరి 24 : మిర్యాలగూడ టౌన్ రెడ్దికాలనీలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ మహిళా అధ్యక్షురాలు మంద పద్మ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధార్ధ సమక్షంలో శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 35వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దైద సత్యం అధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరిన వారికి మిర్యాలగూడ పట్టణ నేతలతో కలిసి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర పరిపాలన అగమ్యగోచరంగా తయారైందన్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ నిత్యం అబద్దాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు ఏమైనాయని ప్రజలు అధికార పార్టీపై ఎక్కడిక్కడ తిరగబడే పరిస్థితి వచ్చిందన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటు రూపంలో బుద్ధి చెప్పనున్నట్లు వెల్లడించారు.
ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రతి సంవత్సరం మరణిస్తున్నారని మొసలి కన్నీరు కారుస్తూ ఫ్లై ఓవర్ వంతెనలు కడుతామని శంకుస్థాపనలు చేసి నేటికి సంవత్సరం దాటిందని వాటి పరిస్థితి ఇంతవరకు అతి గతి లేదన్నారు. అలాగే వారు గెలిచిన దగ్గరి నుండి మిర్యాలగూడలో తట్టెడు మట్టి అయిన పోశారా అని ప్రశ్నిస్తూ, దానికి వారే ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు హయాంలో కేవలం మున్సిపాలిటికే రూ.76 కోట్లు టెండర్లు అయ్యి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎక్కడ మనకు మంచిపేరు వస్తుందోనని ఆ పనులన్నీ రద్దు చేయించడం జరిగిందన్నారు.
మరలా మన మిర్యాలగూడకు అంత మొత్తంలో బడ్జెట్ తీసుకొచ్చే దమ్ము వీళ్లకు ఉందా? అని నిలదీశారు. ఇకనైనా మిర్యాలగూడ అభివృద్ధి కోసం పనిచేయకపోతే మున్సిపాలిటీ ఎన్నికల్లోనే వారి పనితనం ఏందో తేలిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, మక్డుం పాషా, పశ్య శ్రీనివాస్ రెడ్డి, పునాటి లక్ష్మీనారాయణ, షోయబ్, దైదా వెంకటేశ్, కోలా రామస్వామి, నేరెళ్ల శివ, పెండెం పద్మావతి, షెహనాజ్ బేగం, కోదాటి రమ, సరస్వతి, జయమ్మ, మొండికత్తి లింగయ్య, సత్యనారాయణ, బాలు నాయక్ శ్రీకాంత్, శంకర్, నరేష్, కిరణ్, వెంకటేష్, రవి కిషోర్, సైదులు, పవన్, శేఖర్ పాల్గొన్నారు.

Miryalaguda Town : కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ పట్టణ మహిళా మాజీ అధ్యక్షురాలు మంద పద్మ బీఆర్ఎస్లో చేరిక