కరిగిపోతున్న విదేశీ నిల్వలు
గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ కరిగిపోయాయి. ఈ నెల 15తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 8.094 బిలియన్ డాలర్లు తరిగిపోయి 688.894 బిలియన్ డాలర్లకు పడిపోయినట్టు రిజర్వుబ్యాంక్ వారాంతపు సమీక్షలో వెల్లడించింది.
ముంబై, మే 22: గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ కరిగిపోయాయి. ఈ నెల 15తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 8.094 బిలియన్ డాలర్లు తరిగిపోయి 688.894 బిలియన్ డాలర్లకు పడిపోయినట్టు రిజర్వుబ్యాంక్ వారాంతపు సమీక్షలో వెల్లడించింది. అంతక్రితంవారంలో రిజర్వులు 6.295 బిలియన్ డాలర్లు ఎగబాకి 696.988 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయి 728.494 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ నిల్వలు అంతే వేగంతో పడిపోతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తోడు రూపాయి పాతాళంలోకి పడిపోవడం, ఫారెక్స్ మార్కెట్లో రిజర్వు బ్యాంక్ డాలర్లను భారీగా విక్రయించడంతో నిల్వలు అంతకంతకూ కరిగిపోతున్నాయి. గత వారాంతానికిగాను విదేశీ మారకం రూపంలో ఉన్న ఆస్తుల విలువ 6.483 బిలియన్ డాలర్లు తగ్గి 545.904 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. డాలరేతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురికావడం ఇందుకు కారణమని సెంట్రల్ బ్యాంక్ విశ్లేషించింది. అలాగే పసిడి రిజర్వులు 1.536 బిలియన్ డాలర్లు తగ్గి 119.317 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

