గ్రామాలకు ఆర్థిక చేయూతనివ్వండి
ఎస్ఎల్బీసీ సమావేశంలో వ్యవసాయ మంత్రి తుమ్మలహైదరాబాద్, మే 22 (నమస్తేతెలంగాణ) : వ్యవసాయ, పంట రుణాలకే బ్యాంకులు పరిమితం కాకుండా .. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మరింత ప్రోత్సాహం అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
- ఎస్ఎల్బీసీ సమావేశంలో వ్యవసాయ మంత్రి తుమ్మల
హైదరాబాద్, మే 22 (నమస్తేతెలంగాణ) : వ్యవసాయ, పంట రుణాలకే బ్యాంకులు పరిమితం కాకుండా .. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మరింత ప్రోత్సాహం అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. శుక్రవారం ప్రజాభవన్లో 49వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) త్రైమాసిక సమావేశం జరిగింది. నాబార్డ్, సహకార, వాణిజ్య, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకులు, చురుకైన పాత్ర పోషించాలని కోరారు.
రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరాంతానికి మొత్తం డిపాజిట్లు రూ.9.43 లక్షల కోట్లకు, మొత్తం అడ్వాన్సులు రూ.12.33 లక్షల కోట్లకు చేరాయని, రాష్ట్ర క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 130.78 శాతంగా నమోదై జాతీయ సగటును మించి ఉందని మంత్రి తెలిపారు. ప్రధాన రంగ రుణాలు రూ.4.09 లక్షల కోట్లు, వ్యవసాయ రుణాలు రూ.1.87 లక్షల కోట్లకు చేరడం సంతోషకరమని పేరొన్నారు. పంట రుణాల పంపిణీ రూ.75,486 కోట్లకు చేరి, వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంలో 84.34 శాతం సాధించిందని, మొత్తం వ్యవసాయ, అనుబంధ రంగాలు, మౌలిక వసతుల కింద రూ.1,68,401 కోట్ల రుణాలు పంపిణీ చేసి 101.88 శాతం లక్ష్య సాధన నమోదు కావడం రాష్ట్ర బ్యాంకింగ్ వ్యవస్థ పురోగతిని సూచిస్తున్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

