కట్టంగూర్, మే 07 : చోరీ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ బుధవారం నకిరేకల్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ షేక్ ఆరిఫ్ తీర్పు వెలువరించినట్లు కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. అయిటిపాముల గ్రామానికి చెందిన నకిరేకంటి సైదులు 2024 అక్టోబర్ 30న అదే గ్రామానికి చెందిన పులిజాల నర్సింహ్మ ఇంట్లో చొరబడి బీరువాను ధ్వంసం చేసి అందులోని 4 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించుకుపోయినట్లుగా సమాచారం.
బాధితుడి నర్సింహ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రవీందర్ దర్యాప్తు చేపట్టి నిందితుడు సైదులును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దర్యాప్తు అనంతరం అంతిమ నివేదికను నకిరేకల్ కోర్టులో ఫైల్ చేశారు. కేసు విచారణలో సైదులు దోషిగా తేలడంతో ఏడాది జైలు, రూ.2 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.