తుంగతుర్తి, మే 14 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సూర్యతండా ఆవాసం గుట్టకిందతండాలో ఓ వ్యక్తి ఎస్సారెస్పీ కెనాల్ వద్ద అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. గుట్టకింద తండాకు చెందిన గుగులోతు బిచ్యా (57) కౌలుకు భూమి తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎస్సారెస్పీ కెనాల్ వద్ద అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీంతో బిచ్యా కుమారుడు గుగులోతు నరేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ తెలిపారు.