నీలగిరి, మే 14 : నల్లగొండ పట్టణలోని వెల్కమ్ నల్లగొండ బోర్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం జరిగింది. నల్లగొండ రూరల్ ఎస్ఐ డి.సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం రాజన్నగూడెంకు చెందిన బొల్లం లింగయ్య (40) కూలీ పనుల్లో భాగంగా గుగ్గినపల్లి హనుమంతరెడ్డితో కలిసి ద్విచక్రవాహనంపై మిర్యాలగూడ వైపు వస్తుండగా ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్‌కు వెళ్లే మార్గంలో వెనుక నుండి అతివేగంగా అజాగ్రత్తగా వచ్చిన కంటేనర్ డీకొట్టినట్లు తెలిపారు. ద్విచక్రవాహనం నడుపుతున్న హనుమంతరెడ్డి ఎగిరి ఎడుమవైపు పడగా లింగయ్య కుడివైపు పడి కంటేనర్ వెనుక టైర్ కింద పడి నడుము పై నుండి వెళ్లడంతో కాళ్లు నుజ్జునుజ్జుఅయి అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. హనుమంతరెడ్డికి మాత్రం గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించిన చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. లింగయ్య భార్య సైదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.