నకిరేకల్, మే 28 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ దుర్ఘటన నకిరేకల్ పట్టణ కేంద్రంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ బిలీసాపూర్కు చెందిన చరణ్‌దాస్ (36) ప్రైవేట్ బస్సు క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అమ్మీస్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ నుంచి హైదరాబాద్‌కు మంగళవారం రాత్రి బయల్దేరింది. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో నకిరేకల్ బైపాస్‌లోని చందంపల్లి ఫ్లైఓవర్ వద్ద ఇద్దరు ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు బస్సు నిలిపారు.
క్లీనర్ చరణ్‌దాస్ ప్రయాణీకుల లగేజీని బస్సు వెనుక ఉన్న ఢిక్కిలో పెట్టే క్రమంలో విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం అతడిని ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన చరణ్‌ను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి చరణ్‌దాస్ ఉదయం 7.30 గంటలకు మృతిచెందాడు. బస్సు డ్రైవర్ రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రిష్ణాచారి తెలిపారు.