ఈత నేర్పించడానికి వెళ్లి బావిలో పడి వ్యక్తి మృతి
మనవడికి, మనుమరాలికి ఈత నేర్పించడానికి వెళ్లి కాలుజారి బావిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పెన్పహాడ్ మండల పరిధిలోని మాచారం ఆవాసం అనీరెడ్డిగూడెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
పెన్పహాడ్, మే 02 : మనవడికి, మనుమరాలికి ఈత నేర్పించడానికి వెళ్లి కాలుజారి బావిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పెన్పహాడ్ మండల పరిధిలోని మాచారం ఆవాసం అనీరెడ్డిగూడెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గడ్డం సంజీవ రెడ్డి (53) శుక్రవారం సాయంత్రం తన మనవడు, మనుమరాలుకి ఈత నేర్పించేందుకు భార్య నాగమ్మతో పాటు గ్రామంలోని ఐతగోని సైదులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఇద్దరు పిల్లలకు ఈత నేర్పించి వారిని ఒడ్డుకు చేర్పి మరళా కాళ్లు శుభ్రం చేసుకోవడం కోసం సంజీవరెడ్డి బావి వద్దకు వెళ్లగా కండ్లు తిరగడంతో బావిలో పడి గల్లంతు అయ్యాడు. బావిలో ఉన్న నీళ్లను మోటార్ల సహాయంతో తీయగా శనివారం ఉదయం 6.40 గంటలకు ఆయన మృతదేహం లభించింది. సంజీవ రెడ్డి కొడుకు గడ్డం అరవింద్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కాస్తల గోపికృష్ణ తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

